Hyderebad: కన్న కొడుకు కాదు కసాయి.! ఇంటి నుంచి గెంటేశాడని ఈ పేరెంట్స్ ఏం చేశారో చూడండి..

Hyderebad: కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారని వృద్ధ తల్లిదండ్రులు ఇంటి ఎదుట బ్యానర్‌తో ఆందోళనకు దిగారు.

Ravi
By Ravi
Published on: 16 Sept 2026 5:29 PM IST
Hyderebad
X

Hyderebad: కన్న కొడుకు కాదు కసాయి.! ఇంటి నుంచి గెంటేశాడని ఈ పేరెంట్స్ ఏం చేశారో చూడండి..

Hyderebad: భారతీయ సమాజంలో తల్లిదండ్రులను దైవంగా భావించి చివరి వరకు ఆదరించడం సాంప్రదాయం. కానీ మారుతున్న కాలంలో కొన్ని కుటుంబాల్లో విలువలు మరుగున పడుతున్నాయి. కన్న కొడుకును ప్రయోజకుడిని చేయడానికి సర్వస్వం త్యాగం చేసిన తల్లిదండ్రులకు చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్ అల్విన్ కాలనీలో అత్యంత అమానువీయ ఘటన వెలుగులోకి వచ్చింది. చదివించి ప్రయోజకుడిని చేసిన కన్నకొడుకే తల్లిదండ్రులను నట్టేట ముంచాడు. కష్టపడి సంపాదించి కట్టిన ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మియాపూర్ అల్విన్ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు ఎంతో కష్టపడి ఇల్లు నిర్మించుకున్నారు. తమ కుమారుడు రవికుమార్ ఏరోస్పేస్ ఇంజనీర్ కావడంతో విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించాడని గర్వపడ్డారు. కానీ చదువుకుని ప్రయోజకుడైన కొడుకు, కోడలు ప్రసూన కలిసి తల్లిదండ్రులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు. కనీస మానవత్వం లేకుండా తమను బలవంతంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారని వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తాము ఉంటున్న ఇంటిని ఎవరికీ తెలియకుండా అమ్మకానికి పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కన్నవారికే కనీస ఆశ్రయం కల్పించకుండా ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం పట్ల నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొడుకు మోసాన్ని సహించలేకపోయిన ఆ వృద్ధ దంపతులు వినూత్న నిరసనకు దిగారు. తాము నిర్మించుకున్న ఇంటి గేటుకే పెద్ద ఎత్తున నిరసన బ్యానర్ కట్టి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇంటి ముందే బైఠాయించారు. ఈ బ్యానర్‌పై కొడుకు కోడలు తమను చిత్రహింసలకు గురిచేశారని, ఇంటి నుంచి గెంటేశాడని రాసి ఉంది. చదువుకున్న కొడుకు ఉన్నత స్థాయిలో ఉండి కూడా తల్లిదండ్రులను రోడ్డు పాలు చేయడం పట్ల ఇరుగుపొరుగు వారు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను రక్షించాల్సిన బాధ్యత పిల్లలపై ఉంటుందని చట్టాలు చెబుతున్నా కొందరు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన చట్టపరమైన మార్గాలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తల్లిదండ్రులను వేధించే పిల్లలపై మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటన సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించదగిన విషయంగా మారింది. కన్నవారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి సంతానం గుర్తుంచుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.