Vikarabad: అధికారులకు వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి సీరియస్ ఆదేశాలు
Vikarabad: వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ దీపక్ తివారి సమీక్ష నిర్వహించారు.
Vikarabad: అధికారులకు వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి సీరియస్ ఆదేశాలు
వికారాబాద్: ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో సమావేశము ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంబించాలని ,రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చే సమయంలో నిబంధన ప్రకారం మట్టి గడ్డలు, తప్ప, తేమ ఇతర నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు , గొనె సంచులు అందుబాటులో ఉంచాలని ,ఇతరమౌళిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని తెలిపారు.
రైతులు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, ఆలస్యం లేకుండా, రైతులు వేచి చూసే పరిస్థితి రాకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు కొనుగోలు చేసిన ధాన్యానికి జిల్లాలోని రైతులు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వెంకటాచారి,డి ఆర్ డి ఎ శ్రీనివాస్, డి ఎస్ ఓ సుదర్శన్, డి ఎం సి ఎస్ మోహన్ కృష్ణ,వ్యవసాయ అధికారి రాజా రత్నం, మార్కెటింగ్ ఎం డి రియాజ్,మార్క్ఫెడ్ రేఖ, డి సి ఓ నాగార్జున సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




