Serilingampally: శేరిలింగంపల్లిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

Serilingampally: కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో రూ. 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 27 Aug 2026 7:52 PM IST
Serilingampally
X

Serilingampally: శేరిలింగంపల్లిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో CMC వారి ఆధ్వర్యంలో రూ. 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ నారాయణ్ అమిత్ మాలెం పాటి గారు, గౌరవ డీసీ శ్రీ సేవా ఇస్లావత్ మరియు CMC అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో రూ. 30 లక్షల రూపాయల అంచనా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.కార్యాలయం లో పని నిమిత్తం కోసం వచ్చే ప్రజలకు, ఉద్యోగస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని , ఆకలి తీర్చే విధంగా అన్ని హంగులతో సకల సౌకర్యాలతో క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగినది అని, అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో టిఫిన్, భోజనం లభించునని, సరసమైన ధరలకు చక్కటి రుచికరమైన భోజనం అందించబడునని, అన్ని రకాల మౌలిక వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరిగినది అని, ప్రజలకు చక్కటి రుచికరమైన భోజనం అందించాలని, వినియోగదారుల మన్ననలు పొందాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో AMC ప్రేమ్ కుమార్, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు EE శిరీష,DE ఆనంద్,AE భాస్కర్,AE రషీద్, UBD మేనేజర్ విక్రమ్ మరియు నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి , తిరుపతి,TLF ప్రెసిడెంట్ వీణా, మహిళ సమాఖ్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story