Hyderabad: ఆతిథ్య రంగంలో అపార అవకాశాలు.. ఓయూ వీసీ
Hyderabad: హోటల్ మేనేజ్మెంట్, కలినరీ ఆర్ట్స్ రంగాల్లో విశ్వవ్యాప్తంగా అపార అవకాశాలు ఉన్నాయని ఓయూ వీసీ ఆచార్య కుమార్ మొలుగరం అన్నారు.
Hyderabad: ఆతిథ్య రంగంలో అపార అవకాశాలు.. ఓయూ వీసీ
హైదరాబాద్: హోటల్ మేనేజ్మెంట్, కలినరీ ఆర్ట్స్ విభాగాలతో విశ్వవ్యాప్త కెరీర్కు అపారఅవ కాశాలున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం అన్నారు.
ఆతిథ్య రంగంలో అవకాశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, కెరీర్ కౌన్సిలర్లకు మరింత అవగాహన కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ హోటల్ మేనేజ్మెంట్, కలినరీ ఆర్ట్స్ కళాశాలలు, తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్, తెలంగాణ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ ఆఫ్ కలినరీ అండ్ హాస్పిటాలిటీ(టీచ్) ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని హోటల్ ర్యాడిసన్ బ్లూ ప్లాజాలో సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడారు. అతిథులు.. రాడిసన్ బ్లూ హోటల్స్ సౌత్ ఇండియా ఏరియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ జోషి, తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమే మరాఠీ, రాడిసన్ బ్లూ హోటల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజ్ భట్టాచార్య, టీచ్ ప్రెసి డెంట్ సాక సుధా కుమార్, స్వామినాథన్ కుప్పురాజ్ తదితరులు పాల్గొన్నారు.




