Osmania University: ఉస్మానియా వర్సిటీలో నిరసన విద్యాశాఖ మంత్రిని నియమించాలి

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ పాలమూరు వర్సిటీ జేఏసీ చైర్మన్ నరేందర్.

HARISH, TARNAKA
Published on: 28 Jun 2026 3:25 PM IST
Osmania University
X

Osmania University: ఉస్మానియా వర్సిటీలో నిరసన విద్యాశాఖ మంత్రిని నియమించాలి

ఉస్మానియా యూనివర్సిటీ: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని పాలమూరు యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ పోలే నరేందర్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండు సంవత్సరాలు దాటిపోయిన కూడా విద్యాశాఖ మంత్రిని నియ‌మించ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని అన్నారు. విద్యాశాఖను సీఎం తన వద్దనే పెట్టుకోవడంతో విద్యా రంగం సమస్యలను ఎవరికి విన్నవించాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

తెలంగాణలో విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. విద్యా హక్కు చట్టాలు అమలు నోచుకోక పేద విద్యార్థులు విద్యకి దూరం అవుతున్నారన్నారు. ఫీజుల నియంత్రణ లేకపోవడం తో ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఇష్టారీతిన ఫీజులను వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఫీజు మాత్రమే విద్యార్థులు నుండి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రిని నియమించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు.

విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే రానున్నరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అఖిల్, కిరణ్, విక్రమ్, తరుణ్, యోగి, రాము దినేష్ తదితరులు విద్యార్థి నేతలు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story