Hyderabad: ఓయూలో డాక్టర్ నరేందర్ పవార్‌కు ఘన సన్మానం!
Hyderabad: డీసీసీ అధికార ప్రతినిధిగా నియమితులైన డాక్టర్ నరేందర్ పవార్‌ను ఓయూలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఘనంగా సన్మానించారు.
Hyderabad: ఓయూలో డాక్టర్ నరేందర్ పవార్‌కు ఘన సన్మానం!
Hyderabad: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి)అధికార ప్రతినిధిగా నియమితులైన డా. నరేందర్ పవార్ ను ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జేఏసీ చైర్మన్ & తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. పిడమర్తి రవి,విద్యార్థి నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా తో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డా. నరేందర్ పవార్ పోషించిన పాత్రను గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీ అధికార ప్రతినిధిగా పనిచేసి తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
ప్రస్తుతం లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా డా. నరేందర్ పవార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షులకు,టీపీసీసీ ఉపాధ్యక్షులు ఝాన్సీ రెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని డా. నరేందర్ పవార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు శివాజీ నాయక్, చందర్ నాయక్, ప్రసాద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.




