Cyberabad: రంగారెడ్డి నగర్‌లో 'వన్ వార్డ్ ఎవరీ డే': క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్!

Cyberabad: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 'వన్ వార్డ్ ఎవరీ డే' కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి నగర్ వార్డులో కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 8 Sept 2026 6:58 PM IST
Cyberabad
X

Cyberabad: రంగారెడ్డి నగర్‌లో 'వన్ వార్డ్ ఎవరీ డే': క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్!

Cyberabad: వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు మరియు RWA ప్రతినిధులతో కలిసి కుత్బుల్లాపూర్ జోన్, చింతల్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డి నగర్ వార్డులో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ RWA ప్రతినిధులు మరియు స్థానిక నివాసులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, శ్మశానవాటిక అభివృద్ధి, వీధి దీపాలు, బస్ షెల్టర్లు, కమ్యూనిటీ సదుపాయాలు, పబ్లిక్ టాయిలెట్లు, ట్రాఫిక్ నిర్వహణ, ఆక్రమణలు తదితర అంశాలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజలు లేవనెత్తిన ప్రతి సమస్యను నమోదు చేసి, విభాగాల వారీగా సమీక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత విభాగాలు సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించడంతో పాటు, అవసరమైన చోట ఇతర లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయం చేసుకుని సకాలంలో చర్యలు చేపట్టాలని సూచించారు.

వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకుని, సంబంధిత విభాగాలతో సమన్వయంతో వాటి పరిష్కారానికి సీఎంసీ చర్యలు కొనసాగిస్తోంది అన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story