Rangareddy: 15 ఏళ్లుగా మారిన బోడంపహాడ్ రోడ్డు రూపురేఖలు!
Rangareddy: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్–మన్మరి–అప్పారెడ్డిగూడ రోడ్డు గత 15 ఏళ్లుగా అధ్వాన్నంగా మారింది.
Rangareddy: 15 ఏళ్లుగా మారిన బోడంపహాడ్ రోడ్డు రూపురేఖలు!
Rangareddy: షాబాద్ మండలంలో అన్ని గ్రామాల రోడ్లకు నిధులు కానీ ఈ రహదారికి మాత్రం మొండిచెయ్యి,వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్
రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలంలోని బోడంపహాడ్–మన్మరి–అప్పారెడ్డిగూడ గ్రామాలను కలిపే ప్రధాన రహదారి గత 15 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా అధ్వాన్నంగా మారింది. భారీ గుంతలు, దెబ్బతిన్న రోడ్డు కారణంగా ప్రతిరోజూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతుండగా, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సేవలు కూడా సకాలంలో చేరలేని పరిస్థితి నెలకొంది.
షాబాద్ మండలంలోని పలు గ్రామాల రహదారులు అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, బోడంపహాడ్–మన్మరి–అప్పారెడ్డిగూడ రహదారి మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యానికి గురైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఎవరైనా అనారోగ్యం పాలైనా గర్భిణులను ఆస్పత్రికి తరలించాలన్నా ఈ గుంతల రోడ్డుపై నరకయాతన అనుభవించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ రహదారికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి, శాశ్వతంగా మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




