Osmania University: ఓయూలో రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు..

Osmania University: ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఎన్ ఎస్ యు ఐ (NSUI) నాయకులు ఘనంగా నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 19 Jun 2026 4:59 PM IST
Osmania University
X

Osmania University: ఓయూలో రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు..

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఎన్ ఎస్ యు ఐ నాయకులు కోట దుర్గ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం కోట దుర్గ రాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో ప్రధానమంత్రి అవడం ఖాయం అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ఎన్ఎస్యుఐ నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే అది కేవలం రాహుల్ గాంధీ వల్లనే సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో NSUI నాయకులు సురేందర్,శ్రీధర్,సతీష్,సృజన్,రాము,రామకృష్ణ,ఉదయ్,బాబు,సాయి,సతీష్,సైదులు,అఖిల్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story