Medipally: డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీ మల్లు రవిని కలిసిన కాంగ్రెస్ నేతలు
Medipally: మల్కాజిగిరి పరిధిలోని కాంగ్రెస్ నూతన డివిజన్ అధ్యక్షులు తెలంగాణ డిప్యూటీ సీఎం , ఎంపీ మల్లు రవిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
Medipally: డిప్యూటీ సీఎం భట్టి, ఎంపీ మల్లు రవిని కలిసిన కాంగ్రెస్ నేతలు
మేడిపల్లి: మల్కాజిగిరి నగరపాలక సంస్థ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా ఇటీవల నూతనంగా నియమితులైన డివిజన్ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మేడిపల్లి డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ డివిజన్ అధ్యక్షుడు బండి శ్రీరాములు, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బొమ్మక్ కళ్యాణ్, చెంగిచెర్ల డివిజన్ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, పోచారం డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్, ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షుడు సామల అమర్ పాల్గొన్నారు.
నూతన డివిజన్ అధ్యక్షులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీ మల్లు రవి అభినందిస్తూ, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలందించాలని పిలుపునిచ్చారు.
"కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం మా ప్రధాన బాధ్యత. పార్టీ బలోపేతమే మా లక్ష్యం. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు అంకితభావంతో పనిచేస్తాం" అని నూతన అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పూస రమేష్, శేఖర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




