Secunderabad: కిచెన్ గదిలో అస్థిపంజరం.. మద్యం మత్తులో ఘోరం!
Secunderabad: సికింద్రాబాద్ నేరేడ్మెట్లో మద్యం మత్తులో జరిగిన గొడవ హత్యకు దారితీసింది.
Secunderabad: కిచెన్ గదిలో అస్థిపంజరం.. మద్యం మత్తులో ఘోరం!
Secunderabad: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ హత్యకు దారి తీసింది నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డ మీద కూలీలుగా పని చేస్తున్న వెంకతరములు, మల్లేష్ లు డిసెంబర్ 15 న పని దొరకపోవడంతో రూమ్ లో మద్యం సేవించారు. మద్యం మత్తులో వ్యక్తిగత దూషణకు దిగగా, కోపంతో మల్లేష్ వెంకటరమణను కొట్టి హత్య చేశాడు.. శవం ఎక్కడ పెట్టాలో తెలియక కిచెన్ లోని గ్యాస్ సిలిండర్ పెట్టే ప్రాంతంలో శవాన్ని పెట్టి సిమెంట్ తో గొడ నిర్మించాడు.
గత మూడు నాలుగు నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో యజమాని వేరే వాళ్లకు రూం అద్దెకు ఇవ్వగా, రెండు రోజుల తర్వాత ఇంట్లో దుర్వాసన రావడంతో కిరాయిదారులు యజమానికి సమాచారం అందించారు.. కట్టిన గోడను కూలగొట్టి చూడగా శవం పూర్తిగా ఆస్తి పంజరంగా కనిపించింది.. వెంటనే పోలీసులకు తెలియజేయగా దర్యాప్తు చేపట్టిన నేరెడ్మేట్ పోలీసులు టీం లుగా ఏర్పడి మల్లేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.




