Hyderabad: నార్సింగిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

Hyderabad: నార్సింగి పీఎస్ పరిధిలో బైక్‌ను ఢీకొన్న ఎర్టిగా కారు. ప్రైవేట్ సూపర్వైజర్ సోడా ప్రవీణ్ మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 5 Aug 2026 3:57 PM IST
Hyderabad
X

Hyderabad: నార్సింగిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

హైదరాబాద్: ఈ (05.08.2026) తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోడా ప్రవీణ్ (33 సంవత్సరాలు) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆయన రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, న్యూ హఫీజ్‌పేట్ నివాసి కాగా, ఒక ప్రైవేట్ సంస్థలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్టార్ హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి Brought Dead గా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.

ప్రాథమిక విచారణలో, 05.08.2026 అర్ధరాత్రి సుమారు 12:25 గంటలకు, గచ్చిబౌలి సమీపంలోని మై హోమ్ అవతార్ జంక్షన్ – ORR సర్వీస్ రోడ్డుపై, మృతుడు తన హీరో ప్యాషన్ మోటార్ సైకిల్ (AP28 DX 5698) పై వెళ్తుండగా, మారుతి ఎర్టిగా కారు (TG05 TP 0389) నిర్లక్ష్యంగా, అతివేగంగా వచ్చి ఢీకొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ప్రమాదంలో మృతుడికి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.

ఈ ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

వాహనదారులు రాత్రి వేళల్లో మరియు అధిక వేగంతో వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ ధరించడంతో పాటు నిర్ణీత వేగ పరిమితిలోనే ప్రయాణించాలి. నాలుగు చక్రాల వాహనదారులు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండి సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని గుర్తుంచుకొని, ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని నార్సింగి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story