Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిరుపేద పిల్లలకు దుస్తులు పంపిణీ!
Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్ రావి నారాయణరెడ్డి కాలనీ భూ పోరాట కేంద్రంలోని నిరుపేద పిల్లలకు నారాయణ సేవా ట్రస్ట్, మిషన్ ఛాయా సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తుల పంపిణీ.
Hayathnagar: అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిరుపేద పిల్లలకు దుస్తులు పంపిణీ!
Hayathnagar: నారాయణ సేవా ట్రస్టు, మిషన్ ఛాయా సంస్థల ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్–3 భూ పోరాట కేంద్రంలోని నిరుపేద పిల్లలకు ఆదివారం దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నారాయణ సేవా ట్రస్టు ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదాంట్లో కొంత భాగాన్ని నిరుపేదలకు మానవతా దృక్పథంతో అందించాలనే ఉద్దేశంతో ట్రస్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భూ పోరాట కేంద్రంలోని పేదలకు సహాయం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, విద్యార్థుల చదువుకు కూడా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ నిరుపేద పిల్లలకు దుస్తులు పంపిణీ చేసిన నారాయణ సేవా ట్రస్టు, మిషన్ ఛాయా సంస్థల సేవలను అభినందించారు. పేదలకు అండగా నిలుస్తున్న సంస్థలకు పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరింత మంది నిరుపేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి అజ్మీర హరిసింగ్ నాయక్, నారాయణ సేవా ట్రస్టు సభ్యులు ముకేశ్ జీ, సునీత, శారద, మహేశ్వరి, సీపీఐ నాయకులు దుప్పం నిరంజన్, ప్రజా సంఘాల నాయకులు శోభన్, వీరేష్, అలివేలు, వెంకట్ నాయక్, కావేరి తదితరులు పాల్గొన్నారు.




