Nagarguda: అంగరంగ వైభవంగా బోనాల పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు!
Nagarguda: షాబాద్ మండలం నాగర్‌గూడ గ్రామంలో సర్పంచ్ బండ స్వరూప మహేందర్ గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
Nagarguda: అంగరంగ వైభవంగా బోనాల పండుగ అమ్మవారికి ప్రత్యేక పూజలు!
Nagarguda: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగర్‌గూడ గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, భక్తుల సందడితో ఆలయ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. సంప్రదాయాలు, భక్తిశ్రద్ధల మధ్య నాగర్‌గూడలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ యువతతో పాటు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బండ శ్రీకాంత్ గౌడ్ (కిట్టు) మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ మరియు గుర్రం వేణు పాల్గొన్నారు.అలాగే వార్డు సభ్యులు మహిపాల్, క్రాంతి కుమార్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు యాదయ్య ,కృష్ణ,దుర్గేష్, నరేందర్ , పెంటయ్య,రవి,ప్రవీణ్, బాల్ రాజు తదితరులు పాల్గొని బోనాల వేడుకల్లో సందడి చేశారు.




