Nacharam: డెక్కన్ స్ప్రింగ్స్ పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు

Nacharam: నాచారంలోని డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో రక్షాబంధన్ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

HARISH, TARNAKA
Published on: 27 Aug 2026 6:24 PM IST
Nacharam
X

Nacharam: డెక్కన్ స్ప్రింగ్స్ పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు

నాచారం: డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్ ఆవరణలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించారు. రాఖీ పండుగను పురస్కరించుకొని విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో హాజరై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నవనీతరావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్, డైరెక్టర్ డా. కమలా మనోహర్రావు లు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. రక్షాబంధన్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యగానాలు అందరినీ అలరించాయి.

ముఖ్యంగా ప్రైమరీ విద్యార్థుల ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని మాట్లాడుతూ, భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకు విశిష్ట స్థానం ఉందని, అన్నాచెల్లెళ్ల అనురాగ బంధం జీవితంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు.

తోబుట్టువులు ఒకరికొకరు అండగా నిలుస్తూ జీవితాన్ని సుఖవంతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఎప్పటికీ విడదీయరాని మధురానుభూతి తోబుట్టువుల బంధమని పేర్కొంటూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్ హెడ్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story