Nacharam: నాచారంలో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్స్ స్థానికుల ఆందోళన!

Nacharam: నాచారం రాఘవేంద్ర నగర్‌లో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌తో వాహనదారుల ఇబ్బందులు. వెంటనే మూతలు ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి.

HARISH, TARNAKA
Published on: 18 Aug 2026 8:29 AM IST
Nacharam
X

Nacharam: నాచారంలో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్స్ స్థానికుల ఆందోళన!

Nacharam: నాచారం రాఘవేంద్ర నగర్‌లో మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారాయి. మూతలు ధ్వంసమై ఉండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగితే తప్ప సమస్యను పరిష్కరించరా.. అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన వెంటనే మ్యాన్‌హోల్స్‌కు మూతలు ఏర్పాటు చేసి, ప్రమాదాలను నివారించాలని అధికారులను కోరుతున్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story