Nacharam: నాచారంలో 'SIR' అవగాహన వాహనం ప్రారంభం
Nacharam: నాచారంలో SIR అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నేత పరమేశ్వర్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు వివరాలు సరిచూసుకోవాలని పిలుపు.
Nacharam: నాచారంలో 'SIR' అవగాహన వాహనం ప్రారంభం
నాచారం: నాచారం లో టిపిసిసి లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ అవగాహన వాహనాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి మరియు ఉప్పల్ నియోజకవర్గం ఎస్ఐఆర్ ఇంచార్జి వరలక్ష్మి లు ముఖ్య అతిథిలుగా హాజరై ప్రారంభించారు.
అనంతరం పరమేశ్వర్ రెడ్డి నాచారం మరియు హెచ్‌ఎంటీ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ SIR క్యాంపులను సందర్శించి, ప్రజలకు SIR ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జి. కృష్ణారెడ్డి, హెచ్.ఆర్. మోహన్, రమేష్ గౌడ్, రామ్ రెడ్డి, నాచారం డివిజన్ అధ్యక్షులు నూతంకంటి రాజు, శ్రీకాంత్ గౌడ్, హెచ్‌ఎంటీ డివిజన్ అధ్యక్షులు మహేష్ గౌడ్, అశ్వత్థామ రెడ్డి, ఎం. రాజిరెడ్డి, షరీఫుద్దీన్, నర్సింగ్ రావు, రఘు, అజీమ్, ఫిరోజ్, సంతోష్ రెడ్డి, ఖయ్యాం, షాహిద్, రవి యాదవ్, కృష్ణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జి. రాకేష్, నిఖిల్ సాయి, శ్రీధర్, బాలరాజ్, భావనా గౌడ్,ఉమ, భాతమ్మ, భూలక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు.




