Nacharam: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ వంటావార్పు
Nacharam: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై నాచారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.
Nacharam: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ వంటావార్పు
నాచారం: కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1000 రోజుల పాలనలో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నాచారం, హెచ్ఎంటి నగర్ డివిజన్ల బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో యూకే సినీప్లెక్స్ వద్ద రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హాజరై రోడ్డుపై వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చి, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు.
ఒకవైపు హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల నివాసాలను కూల్చివేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు 22-A నిషేధిత జాబితా పేరుతో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇళ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, శ్రీనివాస్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




