Hyderabad: నాచారం డెక్కన్ స్ప్రింగ్స్ స్కూల్‌లో గురుపూజా దినోత్సవం ఘనం

Hyderabad: డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో గురుపూజా దినోత్సవం ఘనంగా జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.

HARISH, TARNAKA
Published on: 5 Sept 2026 12:46 PM IST
Hyderabad
X

Hyderabad: నాచారం డెక్కన్ స్ప్రింగ్స్ స్కూల్‌లో గురుపూజా దినోత్సవం ఘనం

Hyderabad: నాచారం లోని డెక్కన్ స్ప్రింగ్స్ గ్లోబల్ స్కూల్‌లో గురుపూజా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని, వారి పాత్రను తెలియజేస్తూ విద్యార్థులు వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించారు. గురువుల ఆశీస్సులు తీసుకుంటూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కె. నవనీతరావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్, డైరెక్టర్ డా. కమలా మనోహర్‌రావు, కోర్ హెడ్ ఆపరేషన్స్ కిషోర్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని, కోర్ టీమ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వర్ణ అక్కినేని మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో అమూల్యమైనదని, విద్యార్థులను సన్మార్గంలో నడిపించి ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story