Nacharam: 'గణేష్ సురక్ష సంకల్ప్' ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన
Nacharam: నాచారంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం. హాజరైన అడిషనల్ డీసీపీ వెంకట రమణ.
Nacharam: 'గణేష్ సురక్ష సంకల్ప్' ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన
నాచారం: గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘గణేష్ సురక్ష సంకల్ప్–2026’ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లోని అన్నపూర్ణ కాలనీలో పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ వెంకట రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు, యువత, స్థానిక ప్రజలకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వ్యసన నివారణ, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచాల్సిన అవసరంపై పోలీసులు అవగాహన కల్పించారు. ‘మాదకద్రవ్యాలకు నో చెప్పండి’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ప్రతి ఒక్కరికీ మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని చేరవేసి, మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ కె. ధనుంజయ గౌడ్, ఎస్‌ఐలు పి. ప్రభాకర్ రెడ్డి, ఎం. గోవర్ధన్, ఈగిల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.




