Malkajgiri: మల్కాజిగిరి అమ్మవారి ఆలయాల్లో మాజీ ఎమ్మెల్యేప్రత్యేక పూజలు
Malkajgiri: ఆషాఢ మాస బోనాల సందర్భంగా మల్కాజిగిరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Malkajgiri: మల్కాజిగిరి అమ్మవారి ఆలయాల్లో మాజీ ఎమ్మెల్యేప్రత్యేక పూజలు
Malkajgiri: ఆషాడ మాస బోనాల సందర్భంగా మల్కాజిగిరిలోని వివిధ అమ్మవారి ఆలయాలలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో ప్రాచీనమైన మల్కాజిగిరి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు కు ఆలయ కమిటీ వారు సత్కరించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని మల్కాజిగిరి ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు, బోనాల పండుగను శాంతియుత గా జరుపుకోవాలని పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈ సందర్భంగా హనుమంతరావు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,బీకే శ్రీను, డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్,వినోద్ యాదవ్,పిట్టల నాగరాజు,వైనాల ప్రవీణ్, రాందాస్ సంతోష్ ముదిరాజ్,కపిల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి చరణ్ జిత్ గౌడ్,బాబు సత్యనారాయణ,మోహన్ రాజ్,బాల రాజ్, యాదవ్,సురేష్ సింగ్, పార్థసారధి, నరేష్,నరేందర్ గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




