Chevella: ముమ్మరంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ!
Chevella: మున్సిపాలిటీలో ఆగస్ట్ 3 నాటికి ఓటర్ల జాబితా సవరణ (SIR) పూర్తి కావాల్సి ఉన్నందున, ఈ శనివారం లోగా బీఎల్ఓలకు ఫారాలు ఇవ్వాలని కమిషనర్ బి. యాదగిరి కోరారు.
Chevella: ముమ్మరంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ!
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్ట్ 3, 2026 నాటికి SIR ప్రక్రియను పూర్తి చేయవలసి ఉన్నది.కావున పట్టణ ప్రజలు చివరివరకు వేచి చూడకుండా , తప్పులు జరగకుండా నివరించేందుకు ఈ శనివారం లోగానే తమ SIR-ఎన్యుమరేషన్ ఫారాన్ని సంబంధిత బి.ఎల్.ఓ (BLO) లకు ఖచ్చితంగా అందజేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీ B. యాదగిరి గారు కోరారు.
ఏ ఒక్క అర్హులైన ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఈ గడువు లోగా అందజేయగలరు.ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించనిచో ఓటు హక్కు కోల్పోవాల్సి ఉంటుంది.మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన "హెల్ప్ డెస్క్" సేవలను పట్టణ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Next Story




