Serilingampally: శేరిలింగంపల్లిలో ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ!

Serilingampally: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం.. ఆర్.కే.వై ఫౌండేషన్ మట్టి విగ్రహాల పంపిణీలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 9 Sept 2026 6:14 PM IST
Serilingampally
X

Serilingampally: శేరిలింగంపల్లిలో ఆర్.కే.వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ!

Serilingampally: పర్యావరణాన్ని కాపాడాలని అవగాహన కల్పించేందుకు గత 5 సంవత్సరాలుగా రవికుమార్ యాదవ్ గారు ఆర్.కే.వై ఫౌండేషన్ ద్వారా మట్టి వినాయకులను పంపిణీ చేస్తుండగా ఈ సంవత్సరం కూడా మట్టి గణపతుల పంపిణీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మసీద్ బండ శేరిలింగంపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి మాజీ శాసన సభ్యులు బిక్షపతి యాదవ్ గారు ,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా మట్టి గణపతుల పంపిణీ ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ వినాయక చవితి మనందరం ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండుగ అని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, విగ్రహాల వాడకం పర్యావరణానికి ఎంతో హానికరమని తెలియజేస్తూ, పర్యావరణాన్ని కాపాడాలని అవగాహన కల్పించేందుకు గత 5 సంవత్సరాలుగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న రవికుమార్ యాదవ్ గారికి అభినందనలు తెలియజేశారు.

రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు, రవికుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని, మన ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేస్తున్నామని, ప్రతి కాలనీ ,ప్రతి బస్తీ, ప్రతి గల్లి లో పెట్టే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాల వలన మన చెరువులు, మన కుంటలు కలుషితం అవుతున్నాయని, మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలు పెట్టడం వల్ల నిమజ్జనం తర్వాత మట్టి నీటిలో కరిగి పోయి ప్రకృతిలో కలిసిపోతుందని సూచించారు.

ప్రతి ఇంట్లో, గల్లిలో, బస్తీ లో, కాలనీ లో, అపార్ట్మెంట్ లో, గేటెడ్ కమ్యూనిటీ లో ప్రతి దగ్గర మట్టి గణపతులను పెట్టీ పర్యావరణాన్ని, కాపాడాలని కోరుకుంటున్నానన్నారు, ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి,మాణిక్ రావు,రమేష్ నాయి ,మహేష్ అనూష యాదవ్ , రాజేష్ గౌడ్ ,లక్ష్మణ్, గణేష్ ముదిరాజ్, రవి నాయక్ ,ఆంజనేయులు సాగర్, రాజు యాదవ్,జితేందర్ ,బాలు యాదవ్,పద్మ, మేరీ, కవిత,లక్ష్మి,భూపాల్ రెడ్డి ,రాజిరెడ్డి, పట్టాభిరామ్, మొదలగు వారు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story