Bowenpally: బోయిన్‌పల్లి NIMH ని సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్!
Bowenpally: బోయిన్‌పల్లిలోని NIMH సంస్థను సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్. దివ్యాంగ పిల్లలకు అండగా ఉంటామని హామీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు.
Bowenpally: బోయిన్‌పల్లి NIMH ని సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్!
Bowenpally: సికింద్రాబాద్ బోయిన్ పల్లి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్ - NIMH ను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. సంస్థలోని సౌకర్యాలు, సేవలను అడిగి విద్యార్థులను చూసి చలించి పోయిన ఈటెల రాజేంద్ర ఈ సంస్థకు ఎటువంటి అవసరం పార్లమెంట్ సభ్యుడిగా నా బాధ్యతను నెరవేరుస్తానని 40 మంది ఉండే విద్యార్థుల దాదాపుగా 160 మంది విద్యార్థులను తీర్చి దిద్దుతున్న సంస్థకు కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ లను దూరంగా ఉంచి వారికి సమయం కేటాయించి ప్రేమానురాగాలతో వారి జీవితాలను తీర్చిదిద్దాలని ఈటెల రాజేందర్ కోరారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీపం ఉన్నపుడే ఇల్లు సరి చేసుకోవాలి అన్న రకంగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. అధికారం వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఇంకా గొడవలతోనే కాలం గడుపుతున్నారు. కొండా సురేఖ అంశంతో సీఎం రేవంత్ రెడ్డికి అర్థమయ్యి ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై విమర్శించారు.




