Abdullapurmet: మజీద్‌పూర్ బ్రిడ్జి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: ఎంపీ చామల కిరణ్
Abdullapurmet: అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్‌పూర్ బ్రిడ్జిల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్ గౌడ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Abdullapurmet: మజీద్‌పూర్ బ్రిడ్జి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: ఎంపీ చామల కిరణ్
అబ్దుల్లాపూర్మెట్: మజీద్‌పూర్ గ్రామానికి సంబంధించిన బ్రిడ్జిల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్ గౌడ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.
మజీద్‌పూర్–గుంతపల్లి మధ్య ఉన్న బ్రిడ్జి నిర్మాణంతో పాటు, మజీద్‌పూర్–బాటసింగారం మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ ఎంపీని కోరారు. ఈ బ్రిడ్జిలు లేకపోవడంతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా మజీద్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి కూడా ఎంపీ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. ఎంపీ సానుకూల స్పందనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.




