Vanasthalipuram: మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు కరాటే కళ్యాణి!
Vanasthalipuram: పావలా శ్యామల మృతి పట్ల సినీ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె అంత్యక్రియలను మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కరాటే కళ్యాణి తెలిపారు.
Vanasthalipuram: మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు కరాటే కళ్యాణి!
Vanasthalipuram: వనస్థలిపురం రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ లో అభిమానుల సందర్శనార్థం పావలా శ్యామల భౌతికకాయం..
పావలా శ్యామల అంత్యక్రియలపై సినీ అసోసియేషన్ స్పందన
ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల మరణం పట్ల సినీ అసోసియేషన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అసోసియేషన్ ప్రతినిధులు కరాటే కళ్యాణి మాట్లాడుతూ, పావలా శ్యామల చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వయోభారం కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలిపారు. ఆమెతో పాటు ఆమె కుమార్తె కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కొన్ని సంవత్సరాల క్రితమే వారి బాధ్యతలను శంకర్‌కు అప్పగించినట్లు సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి వెల్లడించారు.
అప్పటి నుంచి శంకర్ నిరంతరం వారి సంరక్షణ బాధ్యతలు తీసుకుని, అవసరమైన చోటుకు తీసుకెళ్లడం, వైద్య సహాయం అందించడం వంటి విషయాల్లో అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో అసోసియేషన్ కూడా సమన్వయం చేస్తూ, మానవతా దృక్పథంతో వారికి సహాయం అందించేందుకు కృషి చేసిందని తెలిపారు.
పావలా శ్యామల మరణానంతరం ఆమెకు గౌరవప్రదంగా మహా ప్రస్థానం లో అంత్యక్రియలు నిర్వహించాలని అసోసియేషన్ నిర్ణయించిందని, ఈ విషయాన్ని సభ్యుల గ్రూపులో కూడా తెలియజేసినట్లు వెల్లడించారు.




