Hyderabad: దక్షిణ మధ్య రైల్వే టికెట్ చెకింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం!

Hyderabad: మౌలాలిలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ టికెట్ చెకింగ్ విభాగం విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

Bodike Manohar, Malkajgiri
Published on: 12 Aug 2026 11:29 PM IST
Hyderabad
X

Hyderabad: దక్షిణ మధ్య రైల్వే టికెట్ చెకింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం!

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలో పనిచేసిన టికెట్ చెకింగ్ విభాగం(టిసి) రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మౌలాలిలోని రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై ఒకరినొకరు ఆత్మీయంగా కలుసుకున్నారు.దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఒకే క్యాడర్‌కు చెందిన టికెట్ చెకింగ్ విభాగం విశ్రాంత ఉద్యోగులు తొలిసారిగా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం విశేషమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు తమ పాత సహచరులను కలుసుకుని ఉద్యోగ జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

చాలాకాలం తర్వాత మిత్రులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని,ఈ సమ్మేళనం మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మీయ అనుభూతిని కలిగించిందని వారు తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ విశ్రాంత ఉద్యోగులు వెంకట్రావు, వి.ఎన్.పురానిక్, ఏ. రాజగోపాల్‌ను కమిటీ సభ్యులు ఆర్.సి.ఎస్. రాజు,ఎం.నాగరావు, టి. రామకృష్ణ, ఎం.శ్రీనివాస్, కె.బి.మురళీమోహన్,కె. నర్సింగరావు,బి. భీమయ్య లు ఘనంగా సన్మానించారు.

ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు హాజరైన రిటైర్డ్ ఉద్యోగులు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి పాత సహచరుల మధ్య స్నేహబంధాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story