Abdullapurmet: బండ రావిరాల డంపింగ్ యార్డ్‌పై మోత్కుపల్లి ఫైర్

Abdullapurmet: 135 ఎకరాల దళిత భూములకు రూ.10 కోట్ల నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్.

AJAY, HAYATH NAGAR
Published on: 31 May 2026 3:56 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: బండ రావిరాల డంపింగ్ యార్డ్‌పై మోత్కుపల్లి ఫైర్

అబ్దుల్లా పూర్ మేట్: మండలం బండ రావిరాలలో ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ ను మాదిగ మహా శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా ఖండించారు. 135 ఎకరాల దళితుల భూములను తీసుకోని నష్టపరిహారం చెల్లించకుండా 20 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ మైనింగ్ జోన్ కు కేటాయించి లక్షల కోట్ల రూపాయలు పరిశీలించిన మాదిగ సంపాదించే మైనింగ్ దొరలకు అంటగట్టిందని మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన గ్రామస్థులు,వివిధ పార్టీలతో కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. శివారు ప్రాంతంలో ఉండాల్సిన డంపింగ్ యార్డ్ ప్రజల మధ్యల పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురావుతాయన్నారు. ప్రభుత్వం రైతులకు ప్రకటించిన 10 కోట్ల రూపయల నష్ట పరిహారంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతంగా ఉండాల్సిన గత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నష్టపరిహారాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు.

రైతులకు నష్టపరిహారం చెల్లించేంతవరకు మాదిగ మహాశక్తి ,బిసి పొలిటికల్ ప్రేంట్ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాదిగలకు ఎక్కడ అన్యాయం జరిగినా మోత్కుపల్లి అందుబాటులో ఉంటాడని హామీ ఇచ్చారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story