Moinabad: హైదరాబాద్-బీజాపూర్ హైవేపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్!
Moinabad: బీజాపూర్ హైవే పనులను కేంద్రమే చేపడుతోంది. గెలిచింది మేమైతే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారు: ఎంపీ కొండా.
Moinabad: హైదరాబాద్-బీజాపూర్ హైవేపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్!
మొయినాబాద్: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి (హైవే) అభివృద్ధి పనులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే బీజాపూర్ రోడ్డు విస్తరణ, భూసేకరణ పనులలో తీవ్రమైన జాప్యం జరిగిందని ఎంపీ విమర్శించారు.
నిజాం కాలం నాటి రోడ్డు కావడంతో, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి పనులను చేపడుతోందని ఆయన తెలిపారు.
రోడ్ల నిర్మాణం ఆధునీకరించడం ద్వారా ప్రయాణాలు సులభం కావడంతో పాటు, భవిష్యత్తులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకునేలా కేంద్రం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేమే తెచ్చాం బీజాపూర్ హైవే రోడ్డు అని సోషల్ మీడియాలలో డబ్బు కొట్టుకొని తిరుగుతున్నారు.




