Moinabad: ఫామ్ హౌస్‌లో వలస కూలీ అనుమానాస్పద మృతి!

Moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అమ్డాపూర్ గ్రామంలోని ఒక ఫామ్ హౌస్‌లో విషాదం నెలకొంది.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 19 May 2026 9:32 PM IST
Moinabad
X

Moinabad: ఫామ్ హౌస్‌లో వలస కూలీ అనుమానాస్పద మృతి!

Moinabad: అమ్డాపూర్ గ్రామంలోని ఓ ఫామ్ హౌస్లో పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్కు చెందిన వలస కూలీ సమీర్ మాజీ(32) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందాడు. భార్య రాఖీమాజీ ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సమీర్ మాజీ కుటుంబంతో కలిసి 8 నెలల క్రితం అన్డపూర్కు వచ్చి ఫామ్ హౌస్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఆదివారం రాత్రి గేటుకు తాళం వేసి వస్తానని బయటకు వెళ్లిన సమీర్, అనంతరం ఫామ్ హౌస్ వెనుక వేప చెట్టుకు చీరతో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. కాగా స్థానిక సమాచారం మేరకు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story