Quthbullapur: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు!

Quthbullapur: శంభీపూర్ గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 4 Aug 2026 7:56 PM IST
Quthbullapur
X

Quthbullapur: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు!

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వారు మాట్లాడుతూ బోనాల ఉత్సవాల్లో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బోనాలు ప్రజల ఐక్యతను, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబిస్తూ, ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండగ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు, తాజా మాజీ కౌన్సిలర్లు, గడ్డపోతారం మునిసిపల్ కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story