Nacharam: దివ్యాంగుల విద్యకు ప్రభుత్వం అండగా నిలవాలి!
Nacharam: నాచారంలోని అభయప్రద స్పీచ్ స్కూల్‌ను ఎమ్మెల్సీ మధుసూదనాచారి సందర్శించారు. దివ్యాంగుల విద్య, నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు.
Nacharam: దివ్యాంగుల విద్యకు ప్రభుత్వం అండగా నిలవాలి!
Nacharam: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలను ప్రభుత్వం గుర్తించి మరింత ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి కోరారు. నాచారంలోని అభయప్రద స్పీచ్ స్కూల్ ను ఆయన సందర్శించి విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరింత సహకారం అందించాలని నిర్వాహకులు ఆయనను కోరారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సేవలందిస్తున్న సంస్థలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వారికి సొంత భవనాలు కల్పించడంతో పాటు అవసరమైన వసతులు, వనరులు సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగులలోని ప్రతిభను వెలికితీసి వారు ఆత్మగౌరవంతో జీవించేలా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కార్యక్రమంలో నవనీత రావు, కేశవులు, అషు, హరిబాబు, అశ్వత్థామ రెడ్డి, సాజిద్ ఖాన్, మారయ్య తదితరులు పాల్గొన్నారు.




