Chevella: బోనాల తొట్టెల ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య!

Chevella: చేవెళ్లలో ఆషాఢ బోనాల తొట్టెల ఊరేగింపును ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించి, అమ్మవారికి పూజలు చేశారు. బాలరాజు, కళ్యాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 9 Aug 2026 3:31 PM IST
Chevella
X

Chevella: బోనాల తొట్టెల ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య!

Chevella: చేవెళ్ల పట్టణంలో సీనియర్ నాయకులు శ్రీ మంగలి బాలరాజు, కౌన్సిలర్ శ్రీమతి మంగలి కళ్యాణి యాదగిరి ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా నిర్వహించిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని స్థానిక "శాసనసభ్యులు శ్రీ కాలే యాదయ్య" ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాస బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story