LB Nagar: ఎల్‌బీనగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు!

LB Nagar: ఎల్‌బీనగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. పాపన్న ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 18 Aug 2026 4:54 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్‌బీనగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు!

LB Nagar: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఎల్‌బీనగర్ కూడలిలోని ఆయన విగ్రహానికి ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వీరత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. బహుజనుల హక్కుల కోసం పోరాడిన ధీరుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.

సామాజిక సమానత్వం, ప్రజల స్వేచ్ఛ కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అణగారిన వర్గాల కోసం ఆయన ప్రదర్శించిన ధైర్యం, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.పాపన్న గౌడ్ ఆశయాలను, స్ఫూర్తిని నేటి తరానికి అందిస్తూ ఆయన చూపిన బాటలో ముందుకు సాగడమే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే అన్నారు.

ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, లింగాల రాహుల్ గౌడ్, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story