LB Nagar: ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భారీ ఆటో ర్యాలీ!
LB Nagar: ఎల్బీనగర్ చైతన్యపురిలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆటో ర్యాలీ. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్.
LB Nagar: ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భారీ ఆటో ర్యాలీ!
LB Nagar: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి దిశానిర్దేశం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎల్‌బీనగర్ భారస పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు చైతన్యపురి డివిజన్ పరిధిలోని బాబు కాంప్లెక్స్ నుండి చైతన్యపురి వరకు ఆటో కార్మికుల మద్దతుగా పోరుబాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో నడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులపై భారం పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారి సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. ముఖ్యంగా పలు ప్రధాన డిమాండ్లు తెలిపారు.
దానిలో భాగంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆటో కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని,ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని తెలిపారు.
అనంతరం సుధీర్ రెడ్డి గారు ఆటో నడుపుతూ భారీ ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి పోరుబాట కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్ రెడ్డి,కొప్పుల విఠల్ రెడ్డి,పద్మ నాయక్ డివిజన్ల భారస పార్టీ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, లింగాల రాహుల్ గౌడ్, ఓరుగంటి వెంకటేష్, చంద్రశేఖర్ రెడ్డి,విశ్వప్రేమ్ కుమార్, శివ ప్రకాష్ మరియు పలువురు ఆటో కార్మికులు,బీఆర్‌ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారు.




