Secunderabad: మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ.. ఎమ్మెల్యే శ్రీగణేష్ కామెంట్స్!

Secunderabad: గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను బొంతలు కుట్టడానికి వాడారంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎద్దేవా చేశారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 25 Jun 2026 8:44 PM IST
Secunderabad
X

Secunderabad: మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ.. ఎమ్మెల్యే శ్రీగణేష్ కామెంట్స్!

సికింద్రాబాద్: గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన చీరలు బొంతలు కుట్టడానికి..స్టీల్ బాసండ్లకు..కిటికీలకు కర్టన్లు గా వాడేవారని కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేష్ ఎద్దేవా చేశారు..మారేడ్‌పల్లి క్రికెట్ గ్రౌండ్‌లో మెప్మా డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా ఇందిరా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఏం ఎల్ ఏ శ్రీగణేష్ చీరల పంపిణీ చేశారు.

రాష్ట్రంలోని మహిళా సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న చీరలు వారికి మరింత గౌరవం తెచ్చేలాగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని,గత ప్రభుత్వంలా నాసిరకం చీరలను పంపిణీ చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన చీరలను మాత్రమే అందిస్తోందని స్పష్టం చేశారు.

మహిళలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా, ప్రభుత్వాలకే పన్నులు కట్టే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story