Tandur: అంతారం రైతు వేదికలో 'రైతు నేస్తం' 100వ మైలురాయి ఎపిసోడ్ వేడుకలు

Tandur: అంతారం రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ వేడుకల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని, శాస్త్రీయ వ్యవసాయ ప్రాధాన్యతను వివరించారు.

Srikanth Reddy, Tandur
Updated on: 28 July 2026 9:49 PM IST
Tandur
X

Tandur: అంతారం రైతు వేదికలో 'రైతు నేస్తం' 100వ మైలురాయి ఎపిసోడ్ వేడుకలు

తాండూర్: శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయడానికి భూసార పరీక్షలు చేయించడం, నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవడం మరియు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ముఖ్యమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం అంతారం గ్రామంలోని రైతు వేదికలో రెతు నేస్తం 100 వ ఎపిసోడ్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర్ రావు తో రైతుల నిర్దేశించి వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఇది తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిస్తుందన్నారు. భూమి తయారీ మరియు విత్తన ఎంపిక చాలా ముఖ్యమన్నారు. పొలంలో భూసార పరీక్ష ద్వారా మట్టిని పరీక్షించి ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. కలుపు నివారణకు మరియు నేల గుల్లబారడానికి లోతుగాదుక్కి దున్నాలన్నారు. తెగుళ్లు రాకుండా విత్తనాలను ముందుగా శుద్ధి చేయాలన్నారు. పశువుల ఎరువు లేదా కంపోస్ట్ వాడాలన్నారు. బిందు సేద్యం లేదా తడిపొడి పద్ధతిలో నీరు అందించాలన్నారు.

శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులతో సాగులో వ్యయాన్ని తగ్గించి అధిక దిగుబడులు సాధించుకోవచ్చు అని అన్నారు. అవసరానికి మించి ఎరువులు వాడటం వల్ల నేల నాణ్యత దెబ్బతింటుందని రైతులు గుర్తుంచుకోవాలన్నారు. నేరుగా వరి విత్తే విధానంపై వివరిస్తూ నీటి వినియోగం తగ్గుతుందని, కూలీలపై ఆధారపడాల్సిన పని ఉండదని, సాగు ఖర్చు కూడా తగ్గి ఎక్కువ లాభాలు సాధించవచ్చన్నారు. రైతు నేస్తం 100 ఎపిసోడ్ అనంతరం ఆదర్శ రైతులను ఎమ్మెల్యే సన్మానించారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story