Abdullapurmet: ఇబ్రహీంపట్నంలో కోట్లాది రూపాయల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం!

Abdullapurmet: రూ.700 కోట్లకు పైగా నిధులు సాధించామన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి. అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.

AJAY, HAYATH NAGAR
Published on: 13 Aug 2026 8:43 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: ఇబ్రహీంపట్నంలో కోట్లాది రూపాయల పనులకు ఎమ్మెల్యే శ్రీకారం!

అబ్దుల్లాపూర్ మెట్: అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.. రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, రూ.50 లక్షలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీని ప్రారంభించారు. అనంతరం కవాడిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. బండరావిరాలలో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి.. చిన్నరావిర్యాలలో రూ.10 లక్షలతో నిర్మించిన వీఓ బిల్డింగ్‌ను ప్రారంభించారు. అదే గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఇనామ్‌గూడలో రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే.. పిగ్లీపూర్‌లో రూ.25 లక్షలు, బాటసింగారంలో రూ.75 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మజీద్‌పూర్‌లో రూ.25 లక్షలు, గుంతపల్లిలో రూ.25 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. లష్కర్‌గూడలో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. చివరగా గండిచెరువులో పర్యటించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.. రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు రూ.20 లక్షలతో చేపట్టనున్న మరో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

నిధుల కేటాయింపులో ఇబ్రహీంపట్నానికి అగ్రతాంబూలం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నిధుల మంజూరు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందన్నారు. గత రెండున్నరేళ్లలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.700 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఇక్కడి నుంచి 15 ఏళ్లపాటు గెలిచిన వారు కనీసం రూ.7 కోట్లైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే.. తాను తీసుకొచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అభివృద్ధికి వీలైనంతగా ప్రోత్సాహం అందించాలి తప్ప విమర్శలు చేయడం సరికాదన్నారు.

ప్రజా సమస్యలపై అక్కడికక్కడే స్పందన

పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గ్రామాల్లో ప్రజలతో మమేకమయ్యారు. ఆయా గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

పిగ్లీపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. నూతన గృహానికి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం నిర్వహించారు. అనంతరం ఆ దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు. తమ సొంతింటి కల నెరవేరిన ఆనందంతో ఉన్న ఆ కుటుంబానికి.. స్వయంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గృహప్రవేశానికి హాజరై ఆశీర్వదించడం మరింత ఆనందాన్ని కలిగించింది.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story