Kukatpally: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు
Kukatpally: గురు పౌర్ణమి సందర్భంగా కేపీహెచ్‌బీ రోడ్ నెం. 2 సాయిబాబా ఆలయంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kukatpally: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు
గురు పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం ప్రత్యేక పూజలు
కూకట్‌పల్లి, మారుతి సాగర్ రిపోర్టర్: గురు పౌర్ణమి సందర్భంగా కూకట్‌పల్లి, కెపిహెచ్‌బీ కాలనీ రోడ్ నెం. 2లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయిబాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..
Next Story




