Quthbullapur: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చొరవతో సీఎంఆర్ఎఫ్ సాయం!

Quthbullapur: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చొరవతో జగద్గిరిగుట్టకు చెందిన ఎస్. కార్తీక్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.40 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 22 July 2026 5:49 PM IST
Quthbullapur
X

Quthbullapur: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చొరవతో సీఎంఆర్ఎఫ్ సాయం!

కుత్బుల్లాపూర్: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన 2.40లక్షల రూపాయల ఎల్ఓసీ పత్రాలను చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ కు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు నిరుపేద దరఖాస్తుదారుల కుటుంబసభ్యులకు అందజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.... అర్హులైన ప్రతీ ఒక్కరిని ఆదుకుంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎల్పి విప్ కేపీ.వివేకానంద్ ఆని అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జగద్గిరిగుట్ట డివిజన్ అంజయ్య నగర్ కు చెందిన సంజుల అంజమ్మ భర్త ఎస్.కార్తీక్ (రూ. 2,40,000/- లక్షలు)..

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు రామక్రిష్ణ, అభి తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story