Quthbullapur: హైడ్రా కమిషనర్ పై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన ఎమ్మెల్యే
Quthbullapur: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేట్‌బషీరాబాద్‌లో హైడ్రా ఆగడాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Quthbullapur: హైడ్రా కమిషనర్ పై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార తీరుపై రాష్ట్ర హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మీడియ ముఖంగా హైడ్రా ద్వారా ప్రభుత్వం సాగించిన దురాక్రమ పాలన, హైడ్రా కమిషనర్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ....
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలని హై కోర్టు ఇచ్చిన ఆదేశం పేద ప్రజల విజయం ,అధర్మం పై ధర్మం సాధించిన విజయం. హై కోర్టు తీర్పు బీ ఆర్ ఎస్ పేదల పక్షాన సాగిస్తున్న పోరాటానికి వచ్చిన ప్రతిఫలం.రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడలకు ఈ తీర్పు చెంప పెట్టు.ఏ వ్యవస్థలైన బాబా సాహెబ్ అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పని చేయాల్సిందే కానీ ఎనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారం కాదని హైడ్రా కమిషనర్ ను తొలగించాలని ఇచ్చిన తీర్పు రుజువు చేసింది.
రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ కిందే హైడ్రా పని చేస్తోంది. హై కోర్టు తీర్పు తో రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖల మంత్రిగా కొనసాగే నైతిక అర్హతను కోల్పోయారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. విపత్తుల సమయం లో ప్రజలకు అండగా ఉండాల్సిన హైడ్రా ప్రజలను విపత్తుల్లోకి నెడుతోంది.
తమకు నచ్చిన వారికి నజరానా నచ్చని వారికి జరిమానా అనే విధానాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి హైడ్రా ను దుర్వినియోగం చేస్తున్నారు. హైడ్రా తో ప్రజలకు జరిగిన మేలు గోరంత ..జరిగిన నష్టం కొండంత. హై కోర్టుకు సారీ చెప్పిన రంగనాథ్ తనను తొలగించాలని న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత తన చర్యలని సమర్ధించుకోవడం ఎంతవరకు సబబు ?
న్యాయ వ్యవస్థను గౌరవిస్తారా లేదంటే ఓ వ్యక్తి దుర్మార్గాలను ప్రొత్సహిస్తారా రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. బుల్డోజర్ రాజ్ వైపా రూల్ బుక్ వైపా అనేది రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలి. హైడ్రా లాంటి వ్యవస్థ పేద,మధ్యతరగతి వర్గాల పాలిట హైడ్రోజన్ బాంబు లా మారింది. అందుకే మా అధినేత కేసీఆర్ బీ ఆర్ ఎస్ అధికారం లోకి వచ్చిన వెంటనే హైడ్రా భూతాన్ని తరిమికొడతామని ,మొదటి నిర్ణయం ఇదే అవుతుందని జగిత్యాల సభలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
రంగనాథ్ పోయి ఇంకో రంగయ్య వచ్చినా రేవంత్ హిట్లర్ పోకడలు మానక పోతే హైడ్రా తీరు మారదు. చేసిన దుర్మర్గాలు చాలవన్నట్టు హైడ్రా కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బిఆర్ఎస్ నేతల రక్తం తో పొలాలు పండించాలన్న రేవంత్ రెడ్డి హైడ్రా తో ప్రజల రక్త మాంసాలు కండ్ల జూస్తున్నారు. తనకు హిట్లర్ ఆదర్శమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఈ దేశం లో ఎవరైనా ఉన్నారా?
రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ నీతులు చెబుతారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ మౌనం అనేక అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్, రేవంత్ బ్లాక్ మెయిల్ కు రాహుల్ గాంధీ కూడా భాదితుడిగా మారి రాష్ట్రం లో రాక్షస పాలన నడుస్తున్నా దృతరాష్ట్రుడిలా మారిపోయారా ?
రాహుల్ గాంధీ అధికారం లోకి వస్తే జెన్ జీ తరానికి విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు అప్పగిస్తామని రేవంత్ చెప్పడం మిలీనియం జోక్. రాహుల్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి మంత్రులను నియమిస్తాడా ?
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టు ఉంది రేవంత్ వ్యవహారం.విద్యా శాఖ మంత్రిగా రేవంత్ విఫలమయ్యారు. జెన్ జీ మీద అంత ప్రేమ ఉంటే తన స్థానం లో 30 యేండ్ల లోపున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ను విద్యా శాఖ మంత్రిగా నియమించొచ్చు కదా.రోజుకో డ్రామా ,దినానికో డైవర్షన్ తో రేవంత్ రెడ్డి ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారు. ప్రజలకు రేవంత్ మాయ మాటలన్నీ అర్థమై పోయాయి ..ఇక మసిపూసి మారేడు కాయ చేస్తానంటే కుదిరే కాలం పోయింది.
హైడ్రా కమిషనర్ పై హైకోర్టుర్పు తో రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొమ్మిది తలల సర్పమని హై కోర్టు అంటే రేవంత్ రెడ్డి ని పది తలల రావణుడని ప్రజలు అంటున్నారు.రేవంత్ రావణ పాలన పోవడం ఖాయం కేసీఆర్ రాముడి పాలన రావడం ఖాయం అని ఆయన అన్నారు.




