Dulapally: దూలపల్లి పారిశ్రామికవాడలో రూ.10.90 కోట్లతో మోడల్ రోడ్డు..

Dulapally: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ దూలపల్లి పారిశ్రామికవాడలో రూ.10.90 కోట్లతో చేపట్టనున్న 50 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Updated on: 29 July 2026 10:18 PM IST
Dulapally
X

Dulapally: దూలపల్లి పారిశ్రామికవాడలో రూ.10.90 కోట్లతో మోడల్ రోడ్డు..

దూలపల్లి: ఈరోజు సిఎంసి కొంపల్లి సర్కిల్ పరిధిలోని దూలపల్లి పారిశ్రామికవాడలో జీడిమెట్ల ఐల వద్ద నుంచి దూలపల్లి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నూతనంగా చేపట్టనున్న రోడ్డు విస్తరణతో పాటు నూతన రోడ్డు నిర్మాణ పనులను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాదాపు 2.20 కిలోమీటర్ల పొడవు, 50 ఫీట్ల వెడల్పుతో సుమారు 10.90 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ రోడ్డు విస్తరణతో 20 ఫీట్ల రోడ్డు 50 ఫీట్ల రోడ్డుగా విస్తరించడం ద్వారా భారీ వాహనాల ప్రయాణంతో పాటు దూలపల్లి, కొంపల్లి వంటి సమీప ప్రాంతాలవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

పారిశ్రామికవాడలో రోడ్డు విస్తరణలో భాగంగా 153 కరెంట్ పోల్ షిఫ్టింగ్ పనులతో పాటు రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న 66 చెట్లను ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వేరే ప్రాంతానికి తరలించేందుకు చేపట్టవలసిన చర్యలను వెంటనే చేపట్టాలన్నారు.

రోడ్డు విస్తరణలో భాగంగా నాలాలపై ఉండే కల్వర్ట్ లను వెంటనే పూర్తి చేయాలి.దూలపల్లి - జీడిమెట్ల పారిశ్రామిల వాడలను కలుపుతూ చేపట్టే ఈ రోడ్డు నిర్మాణ పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయపరచుకుంటూ నిర్ణీత కాల పరిమితిలోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.అదేవిధంగా రోడ్డు నిర్మాణ పనులను చక చకా పూర్తి చేసేందుకు పారిశ్రామిక వాడకుండా వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దారి మల్లింపు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిఎంసి ఏఈఈ నరేష్, మాజీ ప్రజా ప్రతినిధులు చింతల దేవేందర్ యాదవ్, సురేష్ రెడ్డి, డప్పు కిరణ్, సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు వెంకటేష్, మహేష్, మధు, వారాల వినోద్, బర్మా రాజు, బర్మ ప్రవీణ్, బర్మా శ్రీకాంత్, మంత్రి రఘు, గుర్రాల గోపాల్, గుబ్బల లక్ష్మీనారాయణ, కోల శ్రీకాంత్, ఇస్మాయిల్, శేషా చారి, దూలపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ సాంబశివరావు, జీడిమెట్ల ఐలా ప్రెసిడెంట్ సాయి కిషోర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story