Vikarabad: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు: తాండూరు ఎమ్మెల్యే!
Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
Vikarabad: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు: తాండూరు ఎమ్మెల్యే!
వికారాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన "మండల స్థాయి సమీక్ష సమావేశం" లో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. గ్రామాల్లో వర్షాకాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వాహణపై సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యంపై అధికారులు సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుధీర్, స్పెషల్ ఆఫీసర్ సత్తర్ , ఎంపీడీవో విశ్వప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, ఏఏంసి చైర్మన్ వడ్డే శ్రీనివాస్, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, అన్ని గ్రామాల సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.




