Uppal: దివంగత మహానేత బండారి రాజిరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తా: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Uppal: దివంగత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి ప్రథమ వర్ధంతిని ఈసీఐఎల్ రాధిక చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.
Uppal: దివంగత మహానేత బండారి రాజిరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తా: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్: దివంగత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈసీఐఎల్ రాధిక చౌరస్తా వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రాజిరెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బండారి రాజిరెడ్డి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన మహానేత అని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన తన రాజకీయ జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతూ, అందరికీ అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఆయన చేసిన కృషి అపారమని, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రాంతానికి మంచి పేరు తెచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుతూ ప్రజలకు మరింత సేవ చేయడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శిరీష సోమ శేఖర్ రెడ్డి , కొత్త రామారావు BRS పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి, బండారి నీలం రెడ్డి BRS పార్టీ నాయకులు మహిపాల్ రెడ్డి ,లక్ష్మి నారాయణ పటేల్ ,మనెమ్మ ,కుమార స్వామి, ఎస్. ఏ. రహీమ్, కైప శిరీష రెడ్డి, బేతల బాలరాజు, సత్తమ్మ, తిరుమలయ్య, కృష్ణ, భాస్కర్, భద్రయ్య, సాయి రెడ్డి, చిన్న రావు, నాగపురి రాజు, మల్లేష్, పిట్టల రాజు, సంభాశివ రెడ్డి, సదాశివ చారి, కాలనీ సంక్షేమ నాయకులు రాములు, యాదగిరి, పెంటయ్య గౌడ్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.




