Cherlapally: చర్లపల్లి చెరువు సుందరీకరణ పరిశీలనఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Cherlapally: చర్లపల్లి చెరువు సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతతో గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ASHOK, KAPRA
Published on: 7 Aug 2026 4:59 PM IST
Cherlapally
X

Cherlapally: చర్లపల్లి చెరువు సుందరీకరణ పరిశీలనఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

చర్లపల్లి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ...ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చర్లపల్లి చెరువులో కొనసాగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.

చెరువును ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్, లైటింగ్, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా చెరువుల పరిరక్షణ, సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

చర్లపల్లి చెరువు అభివృద్ధి పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన వాతావరణం, వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story