Kushaiguda: విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Kushaiguda: కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం.

ASHOK, KAPRA
Published on: 15 Jun 2026 12:27 PM IST
Kushaiguda
X

Kushaiguda: విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Kushaiguda: నూతన విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలో సాగాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి నూతన విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలికారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రీడలు మరియు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story