Kukatpally: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రత్యేక పూజలు

Kukatpally: గురు పౌర్ణమి సందర్భంగా కేపీహెచ్‌బీ భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Maruthisagar, Kukatpally
Published on: 29 July 2026 4:21 PM IST
Kukatpally
X

Kukatpally: సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రత్యేక పూజలు

గురు పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..

కూకట్‌పల్లి: మారుతి సాగర్ రిపోర్టర్: గురు పౌర్ణమి సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గురువుల ఆశీస్సులు సమాజానికి మార్గదర్శకమని, గురు పౌర్ణమి ప్రతి ఒక్కరిలో జ్ఞానం, సేవాభావం, సన్మార్గాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story