Miyapur: చదువుపై ఒత్తిడితో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!

Miyapur: చదువులో వెనుకబడ్డాననే మనస్తాపంతో మియాపూర్ సుభాష్ చంద్రబోస్ నగర్‌లో పదో తరగతి విద్యార్థి మల్లికార్జున (16) ఆత్మహత్య. కేసు నమోదు చేసిన పోలీసులు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 31 Aug 2026 3:09 PM IST
Miyapur
X

Miyapur: చదువుపై ఒత్తిడితో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!

Miyapur: చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో నివాసముంటున్న పెయింటింగ్ కార్మికుడి కుమారుడు మల్లికార్జున (16) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా చదువులో వెనుకబడ్డానని, పరీక్షలు సరిగా రాయలేకపోతున్నాననే ఆందోళనతో మల్లికార్జున మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన విద్యార్థి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీవ్ర నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 16 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో సుభాష్ చంద్రబోస్ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story