Maheshwaram: జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆకతాయిల బీభత్సం డిజిటల్ మానిటర్ ధ్వంసం!

Maheshwaram: మహేశ్వరం మండలం రావిరాల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు డిజిటల్ మానిటర్ ధ్వంసం చేశారు.

K Sai, Maheswaram
Published on: 28 Aug 2026 10:12 AM IST
Maheshwaram
X

Maheshwaram: జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆకతాయిల బీభత్సం డిజిటల్ మానిటర్ ధ్వంసం!

Maheshwaram: రావిరాల గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ మానిటర్ ను ఆకతాయిలు తాళ్లతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశారు.

బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్కూల్ యాజమాన్యం చెప్పుకొచ్చారు.రాత్రి వేళ స్కూల్ ఆవరణలోకి చొరబడిన ఆకతాయిలు మద్యం సేవించి, అక్కడ ఉన్న డిజిటల్ బోర్డుపై దాడి చేశారు. గురువారం ఉదయం పాఠశాల తెరిచేసరికి మానిటర్ పగిలిపోయి, ముక్కలు ముక్కలుగా కనిపించింది. దీంతో షాక్ కు గురైన ఉపాధ్యాయులు వెంటనే ఆదిబట్ల పోలీసులకు సమాచారం ఇచ్చి ఫిర్యాదు చేశారు.

సెక్యూరిటీ లేకపోవడమే ప్రధాన కారణం

పాఠశాలలో రాత్రి కాపలాదారు లేకపోవడమే ఈ దాడులకు కారణమని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ రాత్రి కాగానే కొందరు ఆకతాయిలు స్కూల్ గ్రౌండ్ లోకి వచ్చి మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పాఠశాల ఆస్తిని ధ్వంసం చేస్తున్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థుల డిమాండ్:

ప్రభుత్వ పాఠశాలకు వెంటనే శాశ్వత సెక్యూరిటీ గార్డును నియమించాలి,

రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్ ను ముమ్మరం చేయాలి,

పాఠశాల ఆస్తి ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి.

ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం అందించిన విలువైన డిజిటల్ పరికరాలను ఇలా నాశనం చేయడం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story