Hyderabad: గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన!

Hyderabad: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన. హాజరై అభినందించిన మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు.

RAJESH,	WEST ZONE
Published on: 7 Sept 2026 10:24 AM IST
Hyderabad
X

Hyderabad: గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన!

Hyderabad: రాజకీయాలకతీతంగా వేలా ది మంది గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన చేపట్టడం ఎంతో అభినంద నీయమని మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు కొనియాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక మహమూద్ ఫంక్షన్ హాల్ లో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సుమారు 14 ఏళ్ల క్రితం ఆశా వర్కర్ సలహాతో చిన్న శ్రీశైలం యాదవ్ సీమంతం, అన్నప్రాశన కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

అదే ఒర వడి ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగిస్తూ 2 వేలమంది గర్భిణులకు సీమంతంతో పాటు చీర, సారె అందించి, 250 మంది చిన్నారులకు అన్నప్రాశన చేయడం ఆదర్శనీయమన్నారు. ఆడబిడ్డకు అన్నగా, పుట్టబోయే బిడ్డకు మేనమామగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అదృష్టం అన్నారు.

ఆరోగ్యవంతమనైన సమాజం కోసం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం పౌష్టిక విలువలు గల ఆహార పదార్థాలను తల్లి తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నవయువ నిర్మాణ సేవా సంస్థ ప్రతినిధులు వర్ష యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, వెంకట్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షురాలు గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story